JW subtitle extractor

దేవుడు భూమిని ఎందుకు చేశాడు?

Video Other languages Share text Share link Show times

భూమ్మీద, ఆశ్చర్యం కలిగించే ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.
దేవుడు భూమిని ఎందుకంత ప్రత్యేకంగా తయారుచేశాడు?
అంతరిక్షం నుండి చూసినా,
భూమి ఒక్కటే చాలా ప్రత్యేకంగా కనబడుతుంది.
భూమ్మీద నీళ్లు పుష్కలంగా ఉండేలా దేవుడు చేశాడు.
భూమిని సూర్యునికి మరీ దగ్గరగా
మరీ దూరంగా కాకుండా తగినంత దూరంలో పెట్టాడు.
అలాగే సరైన వేగంతో తిరిగేలా చేశాడు.
భూమి ఎప్పుడూ ఒక కోణంలో వంగి ఉండేలా చంద్రుణ్ణి పెట్టాడు,
దానివల్లే సమయానికి రుతువులు ఏర్పడుతున్నాయి.
అంతేకాదు భూమ్మీద జీవించడానికి ఎన్నో రకాల ప్రాణుల్ని సృష్టించాడు.
దేవుడు ఎందుకంత కష్టపడి భూమిని అందంగా తయారుచేశాడు?
ఎందుకంటే, ఆయన దాన్ని మొదటి మానవ జంట అయిన
ఆదాముహవ్వలకు ఇల్లుగా ఇవ్వాలనుకున్నాడు.
దేవుని మాట విన్నంతకాలం,
వాళ్లూ వాళ్ల పిల్లలూ భూమ్మీద ఎల్లప్పుడూ జీవిస్తారు;
భూమంతటిని అందమైన తోటలా మారుస్తారు.
భూమి విషయంలో దేవుని ఉద్దేశం అదే.
మరైతే ఏం జరిగింది?
భూమి ఎందుకు పరదైసులా లేదు?
ఆదాముహవ్వలు దేవుని మాట వినకపోవడం వల్ల,
చివరికి ముసలివాళ్లై చనిపోయారు,
పరదైసును కోల్పోయారు.
అయితే, భూమి విషయంలో తన ఉద్దేశాన్ని దేవుడు మార్చుకున్నాడా?
ఉదాహరణకు,
ఒకాయన తన కొడుకు కోసం అందమైన ఇంటిని కట్టాలని నిర్ణయించుకున్నాడు.
దాన్ని తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు.
కానీ ఆ అబ్బాయి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా
ఇంటిని పట్టించుకోకపోయేసరికి, అది పాడైపోయింది.
ఇప్పుడు ఆ ప్రేమగల తండ్రి ఏం చేస్తాడు?
ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడతాడా?
లేదు.
ఆయన ఓపిక చూపిస్తూ,
తన కుటుంబంలో ఎవరైతే దాన్ని విలువైనదిగా ఎంచుతారో వాళ్లకిస్తాడు.
అదే విధంగా, ఆదాము ఆ బహుమానాన్ని వద్దనుకున్నా,
దేవుడు భూమి విషయంలో తన ఉద్దేశాన్ని మార్చుకోలేదని బైబిలు చెప్తుంది.
దేవుని ఉద్దేశం ఇప్పటికీ మారలేదు.
ఆయన మీకు పరదైసు భూమిని బహుమతిగా ఇవ్వాలని,
అందులో మీరు ఎప్పటికీ సంతోషంతో,
ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాడు!
మీకు ఈ ప్రశ్నలు రావచ్చు:
భూమంతా అందమైన తోటలా ఎలా మారుతుంది?
అక్కడ ఎవరు ఉంటారు?
వాటికి జవాబులు, దేవుడు చెబుతున్న మంచివార్త!
బ్రోషురులో
5వ పాఠంలో ఉన్నాయి.
దాన్ని jw.org నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మీతో బైబిలు విషయాలు చర్చించడానికి
యెహోవాసాక్షులు సంతోషిస్తారు.
దానికోసం ఆన్‌లైన్‌లో మీ వివరాలు నింపండి.
మీ ప్రాంతంలో ఉంటున్న ఓ యెహోవాసాక్షి
మీకు అనుకూలమైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి చర్చిస్తారు.