JW subtitle extractor

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

Video Other languages Share text Share link Show times

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?
దేవుడు బాధలను ఎందుకు ఉండనిస్తున్నాడు?
మనుషులు బాధలు పడాలన్నది యెహోవా దేవుని ఉద్దేశం కాదు.
బదులుగా మొదటి మానవ జంట జీవితాన్ని ఆయన అద్భుతంగా ఆరంభించాడు.
కానీ సాతాను అనే తిరుగుబాటుదారుడైన చెడ్డదూత, దేవున్ని అబద్ధికుడని పిలిచి,
మొదటి మానవ జంటను మోసం చేసి దేవుని అధికారాన్ని వద్దనుకునేలా చేశాడు.
ఆదాము, హవ్వ దేవుని మాటను ఉల్లంఘించినప్పుడు,
వాళ్లు సాతానును అనుసరించాలని నిర్ణయించుకున్నారు.
యెహోవాకు ఎదురు తిరిగి, వాళ్లకువాళ్లే మంచేదో చెడేదో నిర్ణయించుకున్నారు.
మరి సాతాను చెప్పింది నిజమేనా?
మనుషులు దేవుని సహాయం లేకుండా వాళ్లను వాళ్లు చక్కగా పరిపాలించుకోగలరా?
తిరుగుబాటుదారులు లేవనెత్తిన వివాదాలు పరిష్కారం అవ్వాలంటే సమయం కావాలి.
ఉదాహరణకు, తిరుగుబాటుదారుడైన ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడు నేర్పించే పద్ధతి తప్పని,
ఇంతకన్నా మంచి పద్ధతి తనకు తెలుసని సమర్థించుకుంటాడు.
కొంతమంది విద్యార్థులు అతను చెప్పేదే కరెక్ట్‌ అని అనుకొని, వాళ్లు కూడా ఎదురుతిరుగుతారు.
అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఏమి చెయ్యాలి?
ఎదురుతిరిగిన ఆ పిల్లల్ని మందలించే అధికారం అతనికి ఉంది.
కానీ అలా చేస్తే మిగతా విద్యార్థులు ఏమనుకోవచ్చు?
తన తప్పు బయటపడుతుందని ఉపాధ్యాయుడు భయపడుతున్నాడని అనుకొని
వాళ్లకు అతని మీద గౌరవం పోవచ్చు.
అయితే ఉపాధ్యాయుడు, ఆ పద్ధతి ఏంటో తరగతికి చూపించమని ఆ విద్యార్థిని అనుమతించాడనుకోండి,
అప్పుడు బోధించడానికి ఎవరు అర్హులో అక్కడ ఉన్న వాళ్లందరికి అర్థమౌతుంది.
ఆ ఉపాధ్యాయుడు చేసినలాంటి దాన్నే యెహోవా కూడా చేశాడు.
సాతాను యెహోవాను సవాలు చేసినప్పుడు, కోటానుకోట్ల దేవదూతలు చూస్తున్నారు.
ఆ పరిస్థితిలో యెహోవా ఏమి చేస్తాడనేది ఆ దేవదూతలందరిపైన,
చివరికి ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రాణులందరిపైన చాలా ప్రభావం చూపిస్తుంది.
ఇది తెలిసే యెహోవా, కొంతకాలం సాతాను ఈ లోకాన్ని పరిపాలించేలా అనుమతించాడు.
సాతాను పరిపాలన ఈ లోకానికి చెప్పలేనంత బాధను, వేదనను మిగిల్చింది.
కానీ యెహోవాకు మాత్రమే లోకాన్ని పరిపాలించే హక్కు, సామర్థ్యం ఉన్నాయని స్పష్టంగా తెలిసిన వెంటనే,
సాతాను తిరుగుబాటు కలుగజేసిన నష్టాన్నంతటినీ యెహోవా పూర్తిగా తీసేస్తాడు.
అప్పుడు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్న వాళ్లు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు.
అప్పటి వరకు, దేవుడు ఇంతకాలం ఓపిక పట్టడం వల్ల మనకు ఏ అవకాశం దొరికింది?
దేవుణ్ణి మన పరిపాలకునిగా అంగీకరిస్తున్నట్లు మనమెలా చూపించవచ్చు?
ఈ ప్రశ్నలకు, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు
మంచివార్త! బ్రోషురులో 8వ పాఠంలో ఉన్నాయి.
మీరు jw.org వెబ్‌సైట్‌ నుండి ఒక కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పించడానికి సంతోషిస్తారు.
బైబిలు స్టడీ కోసం ఆన్‌లైన్‌ రిక్వెస్ట్‌ నింపండి,
మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షి మిమ్మల్ని కలిసి
మీకు వీలైన సమయంలో, స్థలంలో బైబిల్లో ఉన్న విషయాలు చర్చిస్తారు.