JW subtitle extractor

దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా?

Video Other languages Share text Share link Show times

దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా?
బైబిలు దేవుణ్ణి ‘ప్రార్థనలు ఆలకించే’ దేవుడని వర్ణిస్తోంది.
మీరు మనసులో చేసుకునే ప్రార్థనల్ని కూడా ఆయన వినగలడు.
ఎలా?
ప్రార్థన ఆలకించే దేవుడే అన్నిటినీ సృష్టించాడు.
మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు,
ఆయనే దాన్ని చేశాడు.
కాబట్టి ఆయన మీ మనసులోని ఆలోచనల్ని చదవగలడు,
మీరు మౌనంగా చేసే ప్రార్థనల్ని వినగలడు.
యెహోవా దేవునికి అన్నిదేశాల వాళ్లపట్ల శ్రద్ధ ఉంది.
మీరు ఏ భాషలో మాట్లాడినా ఆయన అర్థంచేసుకోగలడు.
కానీ ఆయన అన్ని ప్రార్థనల్నీ వింటాడా?
అంగీకరిస్తాడా?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి:
ఒక ఉద్యోగి దొంగతనం చేయడం మేనేజర్‌ చూశాడు.
మేనేజర్‌ అతన్ని నిలదీస్తాడు,
ఉద్యోగి మొదట ఒప్పుకోకుండా అబద్ధాలాడతాడు,
తర్వాత దొంగతనం చేయడానికి గల సాకులు చెప్తాడు.
మేనేజర్‌ అతను చెప్పే అబద్ధాలు, సాకులు వింటాడు,
కానీ వాటిని అంగీకరించడు.
అదేవిధంగా, దేవుడు అన్ని ప్రార్థనల్నీ అంగీకరించడు.
ఉదాహరణకు ఒకవ్యక్తి తన స్వార్థం కోసం ప్రార్థన చేస్తే?
ఇంట్లో భార్యను హింసించి, తర్వాతి రోజు దేవుని దీవెనల కోసం ప్రార్థిస్తే?
శత్రువుల్ని నాశనం చేయడానికి సహాయం చేయమని సైనికులు చేసే ప్రార్థనల సంగతేంటి?
అవతలి వైపు వాళ్లు కూడా అలాగే ప్రార్థిస్తారు.
మరి దేవుడు ఆ ప్రార్థనల్ని అంగీకరిస్తాడా?
తన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉండే ప్రార్థనల్ని దేవుడు అస్సలు అంగీకరించడు
అయితే, కొన్ని ప్రార్థనల్ని దేవుడు వెంటనే అంగీకరిస్తాడు.
మీరు ఒకప్పుడు చెడ్డపనులు చేసినా, ఆయనకు దగ్గరై,
ఆయనిచ్చే తెలివిని, క్షమాపణను పొందాలని నిజంగా కోరుకుంటే మీ ప్రార్థనల్ని అంగీకరిస్తాడు.
ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించే వాళ్లందరి ప్రార్థనల్ని
దేవుడు తప్పకుండా వింటాడు.
కానీ మనం ఎలా ప్రార్థించాలి?
దేవునికి దగ్గరైతే మనకు ఏ ప్రయోజనం ఉంటుంది?
ఈ ప్రశ్నలకు మంచివార్త! బ్రోషురు 12వ పాఠంలో జవాబులున్నాయి.
jw.org వెబ్‌సైట్‌ నుండి మీరు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
యెహోవాసాక్షులు మీకు బైబిలు గురించి నేర్పించడానికి సంతోషిస్తారు.
బైబిలు స్టడీ కోసం ఆన్‌లైన్‌ రిక్వెస్ట్‌ నింపండి,
మీ ప్రాంతంలో ఉన్న ఒక యెహోవాసాక్షి మీకు అనువైన సమయంలో, స్థలంలో
బైబిలు గురించి మాట్లాడడానికి మిమ్మల్ని కలుస్తారు.